విజిల్ : రివ్యూ

October 25, 2019


img

తమిళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న విజయ్ తెలుగులో కూడా ఆ రేంజ్ క్రేజ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అందుకే విజయ్ ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తారు. అట్లీ డైరక్షన్ లో విజయ్ హీరోగా వస్తున్న సినిమా బిగిల్ తెలుగులో విజిల్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాను మహేష్ ఎస్ కోనేరు రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూద్దాం. 

కథ :

రౌడీగా ముద్ర పడిన రాజప్ప (విజయ్) తనయుడు మైఖెల్ ఉరఫ్ బిగిల్ (విజయ్) ఫుట్ బాల్ నేర్చుకుంటాడు. బిగిల్ ను నేషనల్ టీంలో చూడాలని అనుకుంటాడు రాజప్ప. అయితే సెలక్షన్ టైంలో బిగిల్ ఒక రౌడీ కొడుకు అని తెలియగానే అతన్ని సెలెక్ట్ చేయరు. ఇక పరిస్థితుల ప్రభావం వల్ల మైఖెల్ కూడా రాజప్ప మార్గంలో వెళ్తుంటాడు. అయితే అనుకోకుండా మహిళా ఫుట్ బాల్ జట్టుకి కోచ్ గా వెళ్లే అవకాశం వస్తుంది. ఆ టైంలో కూడా అతని జట్టుని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తాడు ఫుట్ బాల్ సెలక్షన్ అధికారి. కాని మైఖెల్ ఇదవరకులా కాకుండా అతని ఆలోచనలకు ఎత్తుగడలు వేస్తూ ఉంటాడు. ఇంతకీ రాజప్ప కోరిక ఏంటి..? మైఖెల్ తను అనుకున్నది సాధించాడా..? మహిళా జట్టుకి కోచ్ గా మైఖెల్ ఎందుకు వెళ్లాడు..? ఇలాంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.   

విశ్లేషణ :

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే కథలకు ఒకే రకమైన స్టోరీ లైన్ ఉంటుంది. అట్లీ కూడా మహిళా జట్టుని గెలిపించే ప్రయత్నంలో చెక్ దే ఇండియా, గోల్కొండ హై స్కూల్ సినిమాల స్టోరీ లైన్ అక్కడక్కడ కలిసినట్టు అనిపిస్తుంది. కథ మాత్రమే కాదు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. విజయ్ స్టామినాకు తగినట్టుగా సన్నివేశాలు ఉన్నాయి. సినిమా చూస్తున్నంతసేపు ఆల్రెడీ ఎక్కడో చూసిన ఫీలింగ్ అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ అంతా విజయ్ ఫ్యాన్స్ కోసం బిల్డప్ సీన్స్ నడిపించగా సెకండ్ హాఫ్ సెంటిమెంట్ తో నింపాడు. సినిమాలో కొన్ని సీన్స్ మహిళా శక్తిని చాటేలా ఉంటాయి. అయితే కథ, కథనాలు రొటీన్ గా అనిపించడం వల్ల తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చూసి పెదవి విరుస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్ సినిమా రేంజ్ వేరేలా ఉంటుంది. అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే కాబట్టి కోలీవుడ్ లో విజిల్ మంచి టాక్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే తెలుగులో మాత్రం విజిల్ జస్ట్ ఓకే అనిపించింది.    

నటన, సాంకేతికవర్గం :

రాజప్ప, బిగిల్ రెండు పాత్రల్లో విజయ్ నటన ఆకట్టుకుంది. తన ఫ్యాన్స్ ను మెప్పించేలా విజయ్ మరోసారి సత్తా చాటాడు. హీరోయిన్ నయనతార కొన్ని సీన్స్ కే పరిమితం అయ్యింది. జాకీ ష్రాఫ్ ఎప్పటిలానే తన మార్క్ చూపించాడు. మహిళా జట్టులో నటించిన వారంత తమ బెస్ట్ అందించారు. మిగతా పాత్రలన్ని పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే.. ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ ఆశించిన స్థాయిలో లేదు. జికే విష్ణు సినిమాటోగ్రఫీ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు అట్లీ పెద్దగా మెప్పించలేదని చెప్పాలి. విజయ్ తెరి, మెర్సల్ సినిమాలు చేసిన అట్లీ హ్యాట్రిక్ మూవీగా వచ్చిన విజిల్ ఆశించిన స్థాయిలో లేదు. ఈ సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.

ఒక్కమాటలో :

విజయ్ విజిల్.. రొటీన్ స్పోర్ట్స్ డ్రామా..!

రేటింగ్ : 2.5/5Related Post

సినిమా స‌మీక్ష