బన్ని బిజినెస్ అదరగొట్టాడు..!

October 19, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి వచ్చిన సామజవరగమన సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.  

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రం, అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీగా వస్తున్న ఈ సినిమా కూడా ఆ హిట్ మేనియా కొనసాగించేలా ఉంది. బిజినెస్ విషయంలో కూడా ఈ సినిమా అదరగొడుతుందని తెలుస్తుంది. ముఖ్యంగా మళయాళంలో అల వైకుంఠపురములో సినిమాను 29 కోట్లకు దక్కించుకున్నారట. నా పేరు సూర్య మళయాళ, హింది రైట్స్ కలిపి 24 కోట్లు కాగా ఇప్పుడు కేవలం మళయాళ వర్షన్ లోనే 29 కోట్లకు కోట్ చేశారట. హింది డబ్బింగ్ రైట్స్ ఇంకా అమ్మలేదని తెలుస్తుంది. మొత్తానికి అల్లు అర్జున్ తెలుగులోనే కాదు మళయాళంలో కూడా తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. Related Post

సినిమా స‌మీక్ష