హిట్టు పడ్డా ఛాన్సులు లేవా..!

October 19, 2019


img

సిని పరిశ్రమలో హిట్టు కొడితే ఆ రేంజ్ వేరేలా ఉంటుంది. డెబ్యూ మూవీ హిట్టు పడ్డది అంటే ఆ హీరో అయినా హీరోయిన్ అయినా వారికి వరుస అవకాశాలు వస్తాయి. అయితే హీరోల కన్నా హీరోయిన్స్ కు ఎక్కువ ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. అదే ఒకవేళ హిట్టు బదులు ఫ్లాప్ పడితే మళ్లీ లెక్క మారుతుంది. అయితే ఈమధ్య ఓ హీరోయిన్ కు అలానే రెండు ఫ్లాపుల తర్వాత ఒక సూపర్ హిట్ పడ్డది.

అక్కినేని హీరోలు నాగ చైతన్యతో సవ్యసాచి, అఖిల్ తో మిస్టర్ మజ్ ను సినిమాలు చేసిన నిధి అగర్వాల్ మూడవ సినిమా ఇస్మార్ట్ శంకర్ హిట్టు కొట్టింది. పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే హిట్టు పడినా సరే అమ్మడికి అవకాశాలు రావట్లేదు. నచ్చిన కథలు రావట్లేదో లేక ఎక్కువ డిమాండ్ చేస్తుందో ఏమో కాని ఇస్మార్ట్ హిట్ తర్వాత కూడా నిధి అగర్వాల్ కు అవకాశాలు రాకపోవడం మాత్రం ఆశ్చర్యకరమని చెప్పాలి. ఓ పక్క క్రికెటర్ రాహుల్ తో ప్రేమ వ్యవహారంపై రుస రుసలాడుతున్న నిధికి అవకాశాలు రాకపోవడం కూడా పెద్ద తలనొప్పిగా మారింది.   Related Post

సినిమా స‌మీక్ష