వితిక మీద ఎలిమినేషన్ కత్తి..!

October 18, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3లో ఈ వారం ఎలిమినేషన్ కత్తి ఎవరి మీద ఉంటుందన్నది ఎక్సైటింగ్ గా మారింది. బిగ్ బాస్ ఇచ్చిన నంబర్ పొజిషన్ లో కూడా హౌజ్ లో ఉన్న ఏడుగురు ఇంటి సభ్యులు ఒక నిర్ణయానికి రాకపోవడం వల్ల ఈ వారం అందరిని నామినేట్ చేశాడు బిగ్ బాస్. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారిలో బాబా భాస్కర్, వితిక, శివ జ్యోతి ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది.  

కేవలం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉన్న ఈ బిగ్ బాస్ సీజన్ 3లో ఈ వారం వితిక ఎలిమినేట్ అవనుందని అంటున్నారు. మొదటి వారం నుండి 2, 3 వారాల్లో వరుసగా నామినేషన్స్ లో ఉన్న వితిక వరుణ్ వల్ల సేవ్ అవుతూ వచ్చింది. అయితే చివరి వారాల్లో ఆట మరింత రసవత్తరంగా సాగనుంది. కాబట్టి ఈ వారం వితిక ఎలిమినేషన్ కన్ ఫాం అంటున్నారు. అయితే వితిక వెళ్లడం వల్ల వరుణ్ తన ఆట మీద మరింత ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి వితిక వెళ్లడమే కరెక్ట్ అంటున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ ఎవరన్నది ఆదివారం తెలుస్తుంది.     Related Post

సినిమా స‌మీక్ష