నితిన్ భీష్మ వాయిదా పడుతుందా..!

October 17, 2019


img

యువ హీరో నితిన్.. యువ దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా భీష్మ. ఛలో అంటూ డెబ్యూ మూవీనే హిట్టు కొట్టిన డైరక్టర్ వెంకీ తన సెకండ్ మూవీని కూడా హిట్ టార్గెట్ తో తెరకెక్కిస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. నితిన్ తో రష్మిక చేస్తున్న మొదటి సినిమా ఇది. అయితే వెంకీ ఛలో సినిమాతోనే రష్మిక టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందుకే అతని సెకండ్ సినిమాకు రష్మిక ఓకే చెప్పింది.

అసలైతే ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 20న భీష్మ రిలీజ్ అనుకున్నారు కాని అదే రోజు సాయి తేజ్ ప్రతిరోజు పండుగే సినిమాతో పాటుగా స్వీటీ అనుష్క చేస్తున్న నిశబ్ధం మూవీ కూడా రిలీజ్ అవుతుంది. అందుకే భీష్మ రిలీజ్ వాయిదా వేసినట్టు తెలుస్తుంది. డిసెంబర్ అనుకున్న రిలీజ్ కాస్త 2020 ఫిబ్రవరిలో భీష్మ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. భీష్మ రిలీజ్ వాయిదాపై అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.



Related Post

సినిమా స‌మీక్ష