హరీష్, క్రిష్.. పవన్ తో ఎవరు..?

October 17, 2019


img

ఇప్పుడప్పుడే మళ్లీ సినిమాల్లో నటించేది లేదు అన్నట్టు చెప్పిన పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోసం మళ్లీ ముఖానికి రంగేసుకోక తప్పట్లేదు. రీసెంట్ గా పవన్ సినిమా చేస్తున్నాడన్న వార్తలు మళ్లీ జోరందుకున్నాయి. పవర్ స్టార్ పవన్ సినిమా కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఆల్రెడీ మైత్రి మూవీ మేకర్స్ పవన్ కు కొంత అడ్వాన్స్ ఇచ్చారట కూడా. అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ చేస్తున్న సినిమా ఏది.. ఈ సినిమాకు దర్శకుడు ఎవరన్నది ఇంకా తెలియలేదు.

ఓ పక్క హరీష్ డైరక్షన్ లో బాలీవుడ్ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తాడని కొందరు అంటుంటే.. మరో పక్క క్రిష్ రాసిన కథకు పవన్ ఓకే చెప్పాడని అతని డైరక్షన్ లోనే పవన్ సినిమా ఉంటుందని అంటున్నారు. గద్దలకొండ గణేష్ హిట్ తో హరీష్ శంకర్ మంచి ఫాంలో ఉన్నాడు. అంతేకాదు పవర్ స్టార్ తో గబ్బర్ సింగ్ లాంటి హిట్ కొట్టాడు హరీష్ శంకర్. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కొద్దిపాటి గ్యాప్ తో పవన్ కోసమే కథ రాసుకున్నాడట క్రిష్. ఆయన సినిమాల్లో కేవలం ఎన్.టి.ఆర్ బయోపిక్ తప్ప అన్ని బాగా ఆడినవే. మరి పవన్ ఎవరికి ఓటు వేస్తాడో చూడాలి.     



Related Post

సినిమా స‌మీక్ష