బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున

October 09, 2019


img

బిగ్ బాస్ సెంటిమెంట్ ప్రకారం హోస్ట్ గా చేస్తున్న వారు ఒక్కసారైనా హౌస్ లోకి వెళ్ళాలా అంటే సీజన్ నడిచే 100 రోజుల్లో ఏదో ఒక పండుగ వస్తుంది. మొదటి సీజన్ లో ఎన్టీఆర్..  సెకండ్ సీజన్ లో నాని హౌస్ లోకి వెళ్లి ఇంటి సభ్యులను సర్ ప్రైజ్ చేశారు. 


ప్రస్తుతం నడుస్తున్న బిగ్ బాస్ 3 వ సీజన్ లో హోస్ట్ గా చేస్తున్న నాగార్జున కూడా దసరా సందర్బంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో భాగంగా హౌస్ మేట్స్ అందరు ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు. హౌస్ లోకి వచ్చిన నాగార్జున ఇంటి సభ్యులకు స్వీట్స్,  గిఫ్ట్స్ తీసుకుని వచ్చాడు. మంగళవారం షో అంతా చాలా సరదాగా నడిచింది.


Related Post

సినిమా స‌మీక్ష