గద్దలకొండ గణేష్ సేఫ్ అబ్బా..!

October 05, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. కోలీవుడ్ మూవీ జిగుర్ తండా రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో అధర్వ, పూజా హెగ్దె, మృణాళిని నటించారు. సెప్టెంబర్ 20న రిలీజైన ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. వరుణ్ తేజ్ ను మాస్ యాంగిల్ లో చూసిన మెగా ఫ్యాన్స్ సినిమాను హిట్ చేశారు. 14 రోజుల కలక్షన్స్ తో దాదాపు బ్రేక్ ఈవెన్ అందుకుంది ఈ సినిమా.

వరల్డ్ వైడ్ గా 24.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన గద్దలకొండ గణేష్ సినిమా 14 రోజుల్లో 37.65 గ్రాస్ అంటే 24.01 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే మరో పాతిక లక్షలు వస్తే ఈ ప్రాజెక్ట్ సేఫ్ అన్నట్టే లెక్క. వరుణ్ తేజ్ అద్భుతమైన నటన, పూజా హెగ్దె చిన్న పాత్ర అయినా అలరించిన విధానంతో పాటుగా హరీష్ శంకర్ డైరక్షన్ సినిమాను ఇంత పెద్ద హిట్ చేశాయి. థియేట్రికల్ బిజినెస్ రిక్వరీ చేయగా డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో నిర్మాతలు లాభ పడ్డారని చెప్పొచ్చు.  Related Post

సినిమా స‌మీక్ష