వరల్డ్ ఫేమస్ లవర్.. రాం చరణ్ సినిమానా..?

September 19, 2019


img

విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ డైరక్షన్ లో వస్తున్న సినిమాకు వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. కె.ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో రాషి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ వంటి క్రేజీ హీరోయిన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయగానే సినిమాపై అంచనాలు పెరిగాయి. యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అని అంటున్నారు.   

అయితే ఈ సినిమా టైటిల్ చూసి ఇది రాం చరణ్ ఆరెంజ్ సినిమాకు దగ్గర కథగా ఉంటుందని అంటున్నారు. మగధీర తర్వాత రాం చరణ్ నటించిన ఆరెంజ్ సినిమాలో వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ తానే అంటుంటాడు. ప్రేమలో లాంగ్ టైం అనేది ఉండదని చెప్పే కథ ఆరెంజ్. అయితే ఆ సినిమా రిజల్ట్ ఏంటన్నది తెలిసిందే. విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా కూడా అలాంటి కథతో వస్తుందని అంటున్నారు. మరి ఆరెంజ్ వర్క్ అవుట్ కాలేదు మరి విజయ్ సినిమా అయినా హిట్ అవుతుందేమో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష