నాగ చైతన్య ప్లేస్ లో నాగ శౌర్య

September 19, 2019


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా ప్లాన్ చేశారు. లక్ష్మి సౌజన్య డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. చైతుకి కథ కూడా బాగా నచ్చిందట. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నాగ చైతన్య ఆ సినిమా నుండి బయటకు వచ్చాడు. అయితే ఇప్పటికే ప్రాజెక్ట్ లేట్ అవుతుండడం వల్ల నిర్మాతలు చైతు ప్లేస్ లో నాగ శౌర్యని తీసుకున్నారట.  

అఫిషియల్ గా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. ఇన్నాళ్లు నాగ శౌర్య సొంత ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. సితార బ్యానర్ లో సినిమా అంటే అతనికిది క్రేజీ ప్రాజెక్ట్ అన్నట్టే. ఈ సినిమాకు సంబందించిన మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. యువ హీరోల్లో వరుస క్రేజీ సినిమాలు చేస్తున్న నాగ శౌర్య సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి చేసే ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.     


Related Post

సినిమా స‌మీక్ష