పూరి 'జనగణమన'.. రేసులో ఆ స్టార్

September 14, 2019


img

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్లీ తన సత్తా ఏంటో చూపించాడు డైరక్టర్ పూరి జగన్నాథ్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. గత మూడు నాలుగేళ్లుగా సరైన హిట్టు లేక కెరియర్ లో వెనుకపడ్డ పూరి ఇస్మార్ట్ శంకర్ తో హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఫైటర్ సినిమా చేస్తున్నాడు పూరి.        

అయితే కొన్నాళ్లుగా సూపర్ స్టార్ మహేష్ తో పూరి జనగణమన సినిమా చేయాలని చూస్తున్నాడు. మహేష్ మాత్రం ఫ్లాపుల్లో ఉన్న పూరిని నమ్మడానికి సాహసం చేయట్లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో మహేష్ కేవలం హిట్టు వచ్చిన వారికే ఛాన్సులు ఇస్తాడంటూ పూరి చేసిన కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. ఇదిలాఉంటే మహేష్ కోసం రాసుకున్న జనగణమన సినిమా ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలని చూస్తున్నాడట పూరి. బాహుబలి తర్వాత ప్రభాస్ నేషనల్ స్టార్ అయ్యాడు. సాహోతో కూడా సత్తా చాటాడు.. అందుకే జనగణమన నేషనల్ వైడ్ గా తీసి హిట్టు కొట్టాలని భారీ స్కెచ్ వేశాడు పూరి. మరి పూరి ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పూరి సినిమా ఉండే ఛాన్స్ ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష