అందరిది ఒకదారి.. అతనిది మరోదారి..!

September 14, 2019


img

హిట్టు సినిమాకు ఫార్ములా ఏంటన్నది ఎవరం చెప్పలేం. స్టార్ సినిమా అయినా సరే ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉంటేనే ప్రాజెక్ట్ సేఫ్ అయ్యేది. అయితే అందరి హీరోలది ఒకదారి తనదో దారి అన్నట్టుగా సినిమా సినిమాకు తెలుగు సినిమాను కొత్త పంథాలో తీసుకెళ్తున్నాడు నాచురల్ స్టార్ నాని. అతనుహీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా న టించింది.   

రివెంజ్ స్టోరీగా విక్రం కె కుమార్ రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా రాసుకున్నాడు. అయితే ఇలాంటి కథలను చేయాలంటే గట్స్ ఉన్న హీరో కావాలి. కెరియర్ మొదలు నుండి ఇలాంటి ప్రయోగాలను చేస్తూ నాని సక్సెస్ అవుతున్నాడు. అందుకే నాని మాత్రమే చేయగల సినిమా గ్యాంగ్ లీడర్ అని చెప్పొచ్చు. తన నాచురల్ పర్ఫార్మెన్స్ తో సినిమా మొత్తాన్ని తన భుజాన వేసుకున్నాడు. ఈ ఇయర్ జెర్సీతో సూపర్ హిట్ అందుకున్న నాని ఆ సినిమా కథ కూడా చాలా కొత్తగా సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక నిన్న రిలీజైన గ్యాంగ్ లీడర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది.      Related Post

సినిమా స‌మీక్ష