డిజిటల్ రైట్స్ లో దుమ్ముదులిపేస్తున్న సైరా..!

September 10, 2019


img

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటికే సినిమా రిలీజ్ ప్రమోషన్స్ షురూ చేశారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు నటిస్తున్నారు. నయనతార ఫీమేల్ లీడ్ గా నటిస్తుండగా తమన్నా కూడా స్పెషల్ రోల్ చేస్తున్నారు.    

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజ్ లో జరుగుతున్నాయి. థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే భారీ రేటు పలుకుతుండగా.. సైరా డిజిటల్ రైట్స్ కోసం నెట్ ఫ్లిక్స్, అమేజాన్ రెండిటి మధ్య గట్టి పోటీ ఏర్పడిందట. నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో కలిపి 30 కోట్ల దాకా వచ్చిందట. అయితే వారికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా 42.5 కోట్లతో కొనేసిందట. డిజిటల్ రైట్స్ లో తమకు సాటి లేరని అమేజాన్ మరోసారి ప్రూవ్ చేసుకుంది.     Related Post

సినిమా స‌మీక్ష