సైరా ఓ అద్భుతమైన అనుభవం

September 10, 2019


img

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ ప్లాన్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సాహో తర్వాత అంత భారీ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న సైరాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా నటించింది.     

సినిమాలో తమన్నా లక్ష్మి అనే పాత్రలో నటించింది. ఈ సినిమాకు సంబందించిన హింది డబ్బింగ్ రీసెంట్ గా పూర్తి చేసిందట. ఆ విషయాన్ని తన ఫ్యాన్స్ తో పంచుకుంది తమన్నా. సైరా హింది డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమాలో భాగమవడం అద్భుతమైన అనుభవమని తన డబ్బింగ్ థియేటర్ లో స్క్రీన్ మీద తన పిక్ ను పోస్ట్ చేసింది తమన్నా. టీజర్ లో కూడా తమన్నా కనిపించి అలరించింది. సైరా సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు వంటి స్టార్స్ కూడా నటించారు.           Related Post

సినిమా స‌మీక్ష