అఖిల్ సరసన ఆమె ఫిక్స్

August 26, 2019


img

అక్కినేని హీరో అఖిల్ చేసిన 3 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందించలేదు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా హీరోయిన్ ను సెలెక్ట్ చేయలేదు. రష్మిక, కియరా అద్వాని లను ట్రై చేయగా వారు వేరే కెమిట్మెంట్స్ తో బిజీగా ఉన్నారని చెప్పారట. 

అందుకే డిజే బ్యూటీ పూజా హెగ్దెని అఖిల్ హీరోయిన్ గా ఫైనల్ చేస్తున్నారట. డిజే తర్వాత స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేస్తున్న పూజా హెగ్దె ప్రస్తుతం చేతినిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది. ప్రభాస్ జాన్ తో పాటుగా వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్న పూజా హెగ్దె అఖిల్ సినిమా ఛాన్స్ కూడా పట్టేసిందని తెలుస్తుంది. అఖిల్ సినిమా కోసం అమ్మడికి 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ముకుంద, ఒక లైలా కోసం సినిమాలు ఆడకపోయినా డిజేతో పూజా దశ తిరిగిపోయింది. ప్రస్తుతం త్రివిక్రం అల్లు అర్జున్ కలిసి చేస్తున్న అల వైకుంఠపురములో కూడా బన్నితో మరోసారి రొమాన్స్ చేస్తుంది పూజా హెగ్దె.  Related Post

సినిమా స‌మీక్ష