బన్ని సరసన లోఫర్ బ్యూటీ

August 24, 2019


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్నారు. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటుగా సుకుమార్ తో సినిమా లైన్ లో ఉంచాడు బన్ని. ప్రస్తుతం ఆ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట.

ఇదే కాకుండా దిల్ రాజు నిర్మాణంలో అల్లు అర్జున్ ఐకాన్ సినిమా ఎనౌన్స్ చేశాడు. వేణు శ్రీరాం ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఐకాన్ సినిమా పోస్టర్ తో సెన్సేషన్ క్రియేట్ చేయగా ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ అలియా భట్ ను అడిగారట. అయితే ఆమె బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల డేట్స్ ఖాళీ లేవని చెప్పిందట. అలియా భట్ నుండి ఆ ఛాన్స్ దిశా పటానికి వెళ్లిందని తెలుస్తుంది. బీ టౌన్ లో సినిమాలతో కన్నా హాట్ ఫోటో షూట్ తో అదరగొడుతున్న దిశా పటాని లోఫర్ సినిమాతో తెలుగులో ఓ ప్రయత్నం చేసింది. అయితే ఆ సినిమా వర్క్ అవుట్ కాకపోవడంతో సైలెంట్ అయ్యింది. ఇన్నాళ్లకు మళ్లీ దిశాకు క్రేజీ ఛాన్స్ వచ్చింది. బన్ని సినిమా దిశా దశ మార్చేస్తుందో లేదో చూడాలి.  

 


Related Post

సినిమా స‌మీక్ష