25 శాతం కాలేయంతో జీవిస్తున్న అమితాబ్..!

August 21, 2019


img

బాలీవుడ్ క్రేజీ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ గురించి షాకింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. కొన్నాళ్లుగా టిబితో బాధపడుతున్న ఆయన తన కాలేయం కేవలం 25 శాతమే బాగుందని దాదాపు 75 శాతం పాడయిందని చెప్పి షాక్ ఇచ్చారు. స్వస్థ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెళ్లడించారు. టిబి వ్యాధి 8 ఏళ్లుగా తనతో ఉన్నా దానిని గుర్తించలేదని అన్నారు అమితాబ్.   

ఇదేదో తాను పబ్లిసిటీ కోసం చెబుతున్నానని అనుకోవద్దని.. తనలా ఇంకెవరు చేయకూడదని అంటున్నారు బిగ్ బీ. రెగ్యులర్ గా టెస్టులు చేయించుకోవడం వల్ల ఎలాంటి వ్యాధినైనా ప్రైమరీ స్టేజ్ లో గుర్తించవచ్చని.. అప్పుడైతే వ్యాధిని సులభంగా నివారించుకోవచ్చని అన్నారు. నిన్న ముంబైలో జరిగిన సైరా టీజర్ ఈవెంట్ కు అమితాబ్ బచ్చన్ అటెండ్ అవలేదు. టిబితో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన అనారోగ్యం కారణంగానే సైరా ఈవెంట్ కు రాలేదని తెలుస్తుంది.   Related Post

సినిమా స‌మీక్ష