బాలయ్య న్యూ లుక్ అదిరింది

August 20, 2019


img

ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత నందమూరి బాలకృష్ణ కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నరు. సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ న్యూ లుక్ లో కనిపిస్తారని తెలుస్తుంది. సినిమా నుండి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. స్టైలిష్ లుక్ లో బాలకృష్ణ చాలా స్మార్ట్ గా కనిపిస్తున్నారు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో బాలకృష్ణ జై సింహా మూవీ చేశారు.  

మరోసారి ఈ కాంబినేషన్ లో మూవీ క్రేజీగా మారింది. 2020 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆల్రెడీ సంక్రాంతికి అల్లు అర్జున్ అల వైకుంఠపురములో.. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలకు పోటీగా బాలయ్య సినిమా కూడా రాబోతుందట. అయితే బాబాయ్ వస్తున్నాడని తెలిసినా అబ్బాయి కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా కూడా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్ చేశారు. మరి నందమూరి హీరోల క్లాష్ ఎలా ఉండబోతుందో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష