ప్రభాస్ ఎక్కడ నేనెక్కడ అనుకున్నా.. కాని..!

August 19, 2019


img

బాహుబలి తర్వాత ప్రభాస్ ఏ స్టార్ డైరక్టర్ తోనో సినిమా చేస్తాడని అనుకున్నారు. కాని ఎవరు ఊహించని విధంగా కేవలం ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో సాహో సినిమా చేశాడు. సుజిత్ తీసిన షార్ట్ ఫిల్మ్ నచ్చి కబురు పంపించాడట ప్రభాస్. అయితే ప్రభాస్ పిలిచినప్పుడు కాకుండా ఆ తర్వాత ఎప్పుడో వెళ్లాడట సుజిత్. అప్పుడు పిలిస్తే ఇప్పుడు వచ్చావా అని ప్రభాస్ అన్నాడట.         

అప్పుడే ప్రభాస్ కోసం రెడీ చేసిన కథ చెప్పాడట. కథ నచ్చడంతో సినిమా ఓకే చేశాడని చెప్పుకొచ్చాడు సుజిత్. బాహుబలి తర్వాత ప్రభాస్ తో సినిమా అంటే సముద్రానికి ఎదురెళ్లడమే. ప్రభాస్ ఎక్కడ తానెక్కడ అనుకున్నాడట.. కాని ప్రభాస్ అన్న తన మీద ఎంతో నమ్మకం ఉంచి నువ్వు చేయగలవ్ అని ప్రోత్సహించడం వల్లే సాహో సినిమా వచ్చిందని అన్నారు సుజిత్. ప్రభాస్ జ్ఞాపశక్తి గురించి ప్రత్యేకంగా చెప్పాడు సుజిత్.. నాలుగేళ్ల క్రిందట చెప్పిన సీన్ కూడా ఇప్పటికి గుర్తు పెట్టుకుని చేశాడని అన్నాడు సుజిత్. మాములుగా ఫ్యాన్స్ అందరికి ఉంటారు కాని ప్రభాస్ కు మాత్రమే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు.. వారి ఓపికకు నా హ్యాట్సాఫ్. బాహుబలి తర్వాత రెండేళ్లు ఈ సినిమాకు టైం పట్టిందని అన్నరు సుజిత్. 



Related Post

సినిమా స‌మీక్ష