కాజల్ కు అన్యాయం చేసిన రణరంగం..!

August 17, 2019


img

తెలుగు, తమిళ భాషల్లో దశాబ్ధ కాలం పైగా స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న కాజల్ ఈమధ్య ఫాం కోల్పోయినట్టు అనిపించినా మళ్లీ వరుస ఛాన్సులతో జోష్ కనబరుస్తుంది. రీసెంట్ గా కాజల్ చేసిన సీత సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. లేటెస్ట్ గా శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వచ్చిన రణరంగం సినిమాలో హీరోయిన్ గా చేసింది కాజల్. ఆ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది.

ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పుడు ఒక హీరోయిన్ కు అన్యాయం జరగడం కామన్. అయితే రణరంగం సినిమాలో కాజల్ ను కేవలం రెండు మూడు సీన్స్ కు మాత్రమే పరిమితం చేశారు. అయితే ఆమె ఉన్నంత సేపు గ్లామర్ షో అదిరిపోయింది. కాజల్ కేవలం రెమ్యునరేషన్ కోసమే ఈ సినిమా చేసిందని కామెంట్స్ వస్తున్నాయి. రణరంగం సక్సెస్ మీట్ లో కాజల్ క్యారక్టర్ ను కావాలనే ట్రిం చేసినట్టు చెప్పాడు శర్వానంద్. సినిమా రన్ టైం ఎక్కువవడం వల్ల కాజల్ సీన్స్ కట్ చేశామని అన్నాడు. ఇక సినిమా టాక్ విషయానికొస్తే శర్వానంద్ స్టైలిష్ లుక్.. అతని కెరియర్ లో ఇదొక మాస్ ఎంటర్టైనర్ గా టాక్ తెచ్చుకున్నా ఓవరాల్ గా మాత్రం అంచనాలను అందుకోలేదని చెప్పొచ్చు.        



Related Post

సినిమా స‌మీక్ష