ఎంత పని చేశావ్ రష్మిక..?

August 17, 2019


img

కన్నడ పరిశ్రమ నుండి వచ్చి ప్రస్తుతం తెలుగులో బిజీ హీరోయిన్ గా మారిన బ్యూటీ రష్మిక మందన్న. తీసిన నాలుగు సినిమాలో రెండు సినిమాలే హిట్టైనా అమ్మడి క్రేజ్ మాత్రం మాములుగా లేదు. ప్రస్తుతం తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ పట్టేసింది. టాలీవుడ్లో సూపర్ ఫాంలో ఉన్న రష్మిక కోలీవుడ్ నుండి ఛాన్సులు అందుకుంటుంది.

తమిళంలో మొదటగా కార్తి సినిమాలో అవకాశం అందుకున్న రష్మిక  సినిమా షూటింగ్ లో ఉండగా సినిమా టైటిల్ లీక్ చేస్తూ మెసేజ్ పెట్టింది. సుల్తాన్ షూటింగ్ లో నాలుగవ రోజు.. 'యు డోంట్ గెట్ టూ సీ ద లుక్ యో' అంటూ మెసేజ్ కూడా పెట్టింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా టైటిల్ చిత్రయూనిట్ ఎనౌన్స్ చేయలేదు. రష్మిక హ్యాష్ ట్యాగ్ సుల్తాన్ అని పెట్టడం వల్ల ఈ సినిమా టైటిల్ సుల్తాన్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక చేసిన ఈ పనికి దర్శక నిర్మాతలు కొద్దిగా అసహనం వ్యక్తపరిచినట్టు తెలుస్తుంది.   



Related Post

సినిమా స‌మీక్ష