మహర్షి కోసం అల్లరి నరేష్ త్యాగం

August 16, 2019


img

మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా మహర్షి. ఈ సినిమాలో మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్ అదరగొట్టాడు. సినిమాలో సెకండ్ హీరోగా అల్లరి నరేష్ సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక కన్ ఫ్యూజన్ లో ఉన్న అల్లరోడికి మహర్షి హిట్ మంచి కిక్ ఇచ్చింది. అయితే ఈ సినిమా కోసం నరేష్ తను హీరోగా చేస్తున్న సినిమా కూడా వాయిదా వేసుకున్నాడట.

అల్లరి నరేష్ హీరోగా బంగారు బుల్లోడి సినిమా ఎప్పుడో మొదలైంది. మహర్షి ముందు వరకు ఆ సినిమా మీద ఫోకస్ పెట్టిన నరేష్ మహర్షి కోసం ఆ సినిమాకు కొంత బ్రేక్ ఇచ్చాడట. మహర్షి తర్వాత మళ్లీ నరేష్ బంగారు బుల్లోడు పూర్తి చేశాడట. బంగారు బుల్లోడు సినిమాను ఈ ఇయర్ దీపావళికి రిలీజ్ ప్లాన్ చేశారు. మరి నరేష్ కు ఈ సినిమా సక్సెస్ అందిస్తుందా లేదా అన్నది చూడాలి.  



Related Post

సినిమా స‌మీక్ష