సన్ని కోసం అంతగా వెతుకుతున్నారా..!

August 13, 2019


img

ప్రతి సంవత్సరం గూగుల్ లో మోస్ట్ సెర్చ్డ్ సెలబ్రిటీస్ ను ప్రకటించడం కామనే.. 2019 లో ఇప్పటివరకు ఎక్కువగా వెతికిన సెలబ్రిటీ ఎవరు అంటే నరేంద్ర మోది, షారుఖ్ ఖాన్ లను దాటేసి సన్ని లియోన్ మొదటి స్థానంలో ఉన్నారు. 2018లో కూడా గూగుల్ ట్రెండ్ ఎనలిటిక్స్ లో ఆమె టాప్ లో ఉంది.

సన్నికి సంబందించిన వీడియోలు.. సినిమా క్లిప్స్ ఇలా సన్ని కు సంబందించిన విషయాల పట్ల గూగుల్ లో బాగానే సెర్చింగ్ జరుగుతుంది. ఆమె బయోపిక్ సీరీస్ కరణ్ జీత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్ని లియోన్ గురించి కూడా గూగుల్ లో బాగా వెతికేశారు. ఇక గూగుల్ లో వరుసగా టాప్ లో ఉంటున్న సన్ని దీనిపై తన స్పందన తెలియచేసింది. గూగుల్ లో తన గురించి ఎక్కువమంది వెతుకుతున్నారని తెలిసి చాలా సంతోషంగా ఉంది. తన అభిమానులే సపోర్ట్ చేస్తున్నారని.. తాను ఇప్పుడు గొప్పగా ఫీలవుతున్నా అంటూ చెప్పుకొచ్చారు. సన్ని ప్రస్తుతం కోకాకోలా సినిమాలో నటిస్తున్నారు.           Related Post

సినిమా స‌మీక్ష