తేజ గోపిచంద్ కాంబినేషన్ ఫిక్సా..!

August 10, 2019


img

మాస్ ఇమేజ్ ఉన్న ఈమధ్య కెరియర్ లో సక్సెస్ అందుకోలేక వెనుకపడ్డాడు గోపిచంద్. ప్రస్తుతం తిరు డైరక్షన్ లో చాణక్య మూవీ చేస్తున్నాడు. 14 రీల్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ అవబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత తేజ డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. 2002 లో వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించాడు గోపిచంద్. 2003లో నిజం సినిమాలో కూడా గోపిచంద్ ను విలన్ గా ప్రమోట్ చేశాడు తేజ.

16 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారని తెలుస్తుంది. ఈసారి తేజ డైరక్షన్ లో గోపిచంద్ హీరోగా సినిమా వస్తుందని అంటున్నారు. గోపిచంద్ కు సరిపోతే ఓ మాస్ మసాలా కథ సిద్ధం చేశాడట తేజ. నేనే రాజు నేనే మంత్రి సినిమాతో డైరక్టర్ గా ఫాంలోకి వచ్చినట్టు అనిపించిన తేజ సీత సినిమాతో మళ్లీ ఢీలా పడ్డాడు. తేజ, గోపిచంద్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష