హిట్ కొడితేనే మహేష్ ఛాన్స్ ఇస్తాడా..!

July 19, 2019


img

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ కొన్నాళ్లుగా హిట్టు కోసం ఎదురుచూస్తున్నాడు. టెంపర్ తర్వాత హిట్ కోసం తపించిపోతున్న పూరికి రామ్  హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఆ దాహం తీర్చింది. ఇస్మార్ట్ శంకర్ అంటూ పూరి, రామ్ కాంబోలో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఇస్మార్ట్ శంకర్ కు మణిశర్మ మ్యూజిక్ అందించాడు.     

ఇక ఈ సినిమా అలా హిట్టు కొట్టాడో లేదో ఇలా సూపర్ స్టార్ మహేష్ పై సంచలన కామెంట్స్ చేశాడు పూరి. మహేష్ బాబుతో పోకిరి, బిజినెస్ మెన్ సినిమాలు చేసిన పూరి జనగణమన సినిమా ఎనౌన్స్ చేశాడు. అయితే ఆ ప్రాజెక్ట్ పై మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ లో కూడా జనగణమన సినిమాపై ప్రశ్నలు అడిగారు. ఇలానే ఓ మీడియా ఇంటర్వ్యూలో జనగణమన సినిమా గురించి అడిగితే మహేష్ కేవలం హిట్ కొడితేనే అవకాశాలు ఇస్తాడని సమాధానం ఇచ్చాడు పూరి. ఒకవేళ ఇప్పుడు మహేష్ అవకాశం ఇస్తే చేస్తారా అంటే నాకు ఓ క్యారక్టర్ ఉంది అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు పూరి. మరి పూరి మాటల్లో ఆంతర్యం ఏంటో తెలియాల్సి ఉంది.  

అంతేకాదు మహేష్ కన్నా మహేష్ ఫ్యాన్స్ అంటేనే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు పూరి. ఈ కామెంట్స్ పై మహేష్ ఫ్యాన్స్ తీవ్రగా ట్రోల్స్ చేస్తున్నారు. నువ్వు హిట్టు కొడితే ఆ ఛాన్స్ ఏదో నీకే ఇచ్చే వాడు కదా అంటూ పూరికి కౌంటర్ ఇస్తున్నారు మహేష్ ఫ్యాన్స్. Related Post

సినిమా స‌మీక్ష