సరిలేరు నీకెవ్వరుకి షాక్ ఇచ్చాడు..!

July 18, 2019


img

సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపుడి కాంబినేషన్ లో మహేష్ 26వ సినిమాగా వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు సడెన్ గా షాక్ ఇచ్చాడు జగపతి బాబు. ఈమధ్య ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న ఆయన సినిమా పట్ల అంత సంతృప్తిగా లేరట.. అంతేకాదు తనకు చెప్పిన పాత్ర ఒకటైతే షూటింగ్ లో మరోలా చేస్తున్నారట అందుకే జగపతి బాబు ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది.

మహర్షి సినిమాలో కూడా జగపతి బాబు విలన్ గా నటించారు. మరి జగపతి బాబు ఏ విషయంలో నచ్చలేదో కాని దాదాపుగా సరిలేరు నీకెవ్వరు నుండి బయటకు వచ్చారని తెలుస్తుంది. జగపతి బాబు వద్దనుకున్న ఈ పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా 2020 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు.Related Post

సినిమా స‌మీక్ష