ఓంకార్ కు హీరోయిన్ దొరకట్లేదు

July 15, 2019


img

రాజు గారి గది 3 సినిమాను మిల్కీ బ్యూటీ తమన్నాతో ఎనౌన్స్ చేసి ముహుర్తం కూడా పెట్టుకున్నారు దర్శక నిర్మాత ఓంకార్. అయితే అనూహ్యంగా ఈ సినిమా నుండి తమన్నా డ్రాప్ అవుట్ అయ్యింది. తమ్నన్నా కాదని చెప్పడంతో తాప్సీని కూడా అడిగారట. ఆమె కూడా సారీ అని చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఫైనల్ గా ఓంకార్ కాజల్ దగ్గరకు వచ్చి చేరాడట. ఎలాగైనా కాజల్ ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నాడట.

అయితే ప్రస్తుతం కెరియర్ పీక్స్ లో ఉన్న కాజల్ రాజు గారి గది 3లో నటించడానికి ఓకే చెప్పే ఆలోచనలోనే ఉందట. కాని రెమ్యునరేషన్ మాత్రం టాప్ లేచేలా డిమాండ్ చేస్తుందట. ప్రస్తుతం సినిమాకు కోటి 75 లక్షల నుండ్ 2 కోట్ల దాకా తీసుకుంటున్న కాజల్ రాజు గారి గది 3లో నటించడానికి అదే రేంజ్ లో చెబుతుందట. మరి కాజల్ ఓకే అవుతుందా లేక ఓంకార్ మరో హీరోయిన్ ను వెతుక్కోవాల్సి వస్తుందా అన్నది చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష