న్యూ టీంతో రాం చరణ్..!

July 10, 2019


img

ఓ పక్క నిర్మాతగా.. మరోపక్క హీరోగా రాం చరణ్ రెండు పాత్రలు చేస్తున్నాడు. సైరా నిర్మాతగా బాధ్యతలు మీద వేసుకున్న చరణ్.. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో అల్లూరిగా అదరగొట్టనున్నాడు. అయితే టైట్ షెడ్యూల్స్ వల్ల ట్రిపుల్ ఆర్ షూటింగ్ లో చరణ్ పాల్గొనాల్సి వస్తుంది. మరోపక్క సైరా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేయడంతో ఆ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టాల్సి ఉంది. అందుకే చరణ్ సైరా ప్రమోషన్స్ కోసం ఓ టీం ఏర్పరచుకున్నారట.

సోషల్ మీడియా మొత్తం హ్యాండిల్ చేసేలా సైరా ప్రమోషన్స్ కు ఓ స్పెషల్ ప్రమోషనల్ టీం ఏర్పాటు చేశారట. వీరికి భారీ మొత్తంగా సాలరీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్యనే చరణ్ కూడా ఇన్ స్టాగ్రాంలోకి వచ్చాడు. ఇక అంతకుముందు ఉన్న ట్విట్టర్ ఎకౌంట్ కూడా మళ్లీ రీ లాంచ్ చేస్తాడట. సినిమా ప్రమోషన్స్ లో సోషల్ మీడియా అంత బాగా సపోర్ట్ గా ఉంటుందో తెలిసిందే. అందుకే రాం చరణ్ ఈ కొత్త నిర్ణయం తీసుకున్నాడు. మరి చరణ్ న్యూ టీం ఎలా పనిచేస్తుందో చూడాలి.      Related Post

సినిమా స‌మీక్ష