ప్రభాస్ 'సాహో'.. టెన్షన్ లో ఫ్యాన్స్

July 10, 2019


img

బాహుబలి సినిమాతో నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ ను ఏర్పరచుకున్న ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సుజిత్ డైరక్షన్ లో సాహో అంటూ వస్తున్న ప్రభాస్ సినిమా టీజర్, మేకింగ్ వీడియోస్ అదుర్స్ అనిపించాయి. అయితే లేటెస్ట్ గా సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. ఈ సాంగ్ హింది, తమిళ భాషల్లో హిట్టైంది. తెలుగులో ఈ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చినా ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం పెద్దగా ఎక్కలేదు.

ప్రభాస్ మాస్ ఫాలోయింగ్ కు ఈ సాంగ్ నచ్చలేదని చెప్పాలి. జిబ్రాన్ మ్యూజిక్ తో వస్తున్న సాహో సినిమా ఎక్కువ బాలీవుడ్ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇది కచ్చితంగా సినిమా మీద నెగటివ్ ఫీలింగ్ కలిగేలా చేస్తుంది. మేకింగ్ వీడియోలో అదరగొట్టిన సాహో తెలుగు సినిమాల్లో మరో సెన్సేషనల్ మూవీగా మారుతుందని అనుకున్నారు. కాని ఆ ఉత్సాహం అంతా ఫస్ట్ సాంగ్ విన్నాక తగ్గిందని అంటున్నారు. కంటెంట్ బాగుండాలే కాని సాంగ్స్ పెద్దగా పట్టించుకోరు.. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న సాహో నిజంగానే సంచలనాలు సృష్టిస్తాడో లేదో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష