బాలీవుడ్ కు వెళ్తున్న జెర్సీ..!

June 25, 2019


img

నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా జెర్సీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మించారు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజై సూపర్ హిట్ అయ్యింది. గౌతం తిన్ననూరి కథ కథనాలు, నాచురల్ స్టార్ నాని నటన సినిమాకు ప్రాణం పోశాయి. లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలతో నిరాశపరచిన నాని జెర్సీతో హిట్ అందుకున్నాడు.

ఈమధ్య తెలుగులో హిట్టైన ఏ సినిమాను వదలని బాలీవుడ్ మేకర్స్ నాని జెర్సీ సినిమా మీద కన్నేశారు. ఈ సినిమా హక్కులను బాలీవుడ్ క్రేజీ డైరక్టర్ కం ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ సొంతం చేసుకున్నారట. అంతేకాదు షాహిద్ కపూర్ హీరోగా జెర్సీ మూవీని రీమేక్ చేస్తారని తెలుస్తుంది. తెలుగు దర్శకుడు గౌతం తిన్ననూరికి డైరక్షన్ ఛాన్స్ ఇస్తారని టాక్. ఈమధ్యనే అర్జున్ రెడ్డి రీమేక్ గా కబీర్ సింగ్ లో నటించి మెప్పించిన షాహిద్ కపూర్ మరో తెలుగు సినిమా రీమేక్ లో నటించడం విశేషం. ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.   



Related Post

సినిమా స‌మీక్ష