జబర్దస్త్ వదిలేస్తున్న అనసూయ

June 17, 2019


img

ఈటివి జబర్దస్త్ షోకి బుల్లితెర ఆడియెన్స్ ఫాలోయింగ్ ఎక్కువే అని చెప్పొచ్చు. ఏ ముహుర్తాన అది మొదలుపెట్టారో కాని గురువారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ ట్రీ జబర్దస్త్ ఈ రెండు వచ్చే సమయాల్లో టివిలకు అతుక్కుపోతుంటారు స్మాల్ స్క్రీన్ ఆడియెన్స్. ఇక యూట్యూబ్ లో కూడా ఈ షోలకు మంచి వ్యూ కౌంట్ వస్తుంది. కమెడియన్స్ అందరు తమ టాలెంట్ తో మెప్పిస్తున్నారు. ఇదిలాఉంటే జబర్దస్త్ షోకి అనసూయ యాంకరింగ్ కూడా హైలెట్ గా నిలుస్తుంది.

ఆమె అందంతో షోకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఒక్కసారి అనసూయ బ్రేక్ ఇచ్చేసరికి ఆ షోలో రష్మి జాయిన్ అయ్యింది. ఆమె యాంకరింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చే సరికి జబర్దస్త్ ను రెండు భాగాలుగా చేసి ఎక్స్ ట్రా జబర్దస్త్ యాడ్ చేశారు. అయితే ఈమధ్య సినిమాల్లో బిజీ అవుతున్న అనసూయ జబర్దస్త్ షో కొనసాగించడం కష్టమవుతుందట. అందుకే షోకి గుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. క్షణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసిన అనసూయ రంగస్థలం రంగమ్మత్త పాత్రలో హంగామా చేసింది. ఒకవేళ అనసూయ జబర్దస్త్ వదిలేస్తే కనుక ఆమె ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవడం ఖాయం.Related Post

సినిమా స‌మీక్ష