కార్తికేయ 'గుణ 369' టీజర్.. రొటీన్ గానే ఉంది కాని..!

June 17, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ ఈమధ్య వచ్చిన హిప్పి పెద్దగా వర్క్ అవుట్ కాకున్నా వెంటనే గుణ 369 అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అరుణ్ జంధ్యాల డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ చూస్తే కథ కొత్తగా ఏమి లేదన్నట్టు తెలుస్తున్నా లవ్ స్టోరీతో కార్తికేయ మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.

కార్తికేయ సరసన అనఘ హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ ఇంప్రెస్ చేయగా కార్తికేయ మాస్ లుక్ ప్రేక్షకులను అలరించేలా ఉంది. ఎప్పటిలానే తన ఫిట్ నెస్ తో కార్తికేయ అదరగొట్టాడు. మాస్ ఇమేజ్ కూడా తెచ్చుకునేందుకు కుర్రాడు బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తుంది. ఆరెక్స్ 100 తర్వాత వచ్చిన హిప్పి డిజప్పాయింట్ చేయగా కనీసం గుణ 369 అయినా అతనికి హిట్ ఇస్తుందేమో చూడాలి. ఈ సినిమా కాకుండా ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో కార్తికేయ విలన్ గా కనిపించనున్నాడు.   


Related Post

సినిమా స‌మీక్ష