సోనాలిని కిడ్నాప్ చేయాలనుకున్న పాక్ క్రికెటర్..!

June 15, 2019


img

బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే సూపర్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా అమ్మడు సినిమాలు తీసి అలరించింది. ఈమధ్యనే క్యాన్సర్ నుండి బయటపడిన సోనాలి మళ్లీ సిని కెరియర్ ను కొనసాగించాలని చూస్తుంది. సోనాలి సినిమాల్లో మంచి ఫాంలో ఉన్న టైంలో పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆమెను కిడ్నాప్ చేయాలని చూశాడట. పాక్ క్రికెటర్ అయిన షోయబ్ కు సోనాలి అంటే చాలా ఇష్టం.. ఆ విషయాన్ని అతను చాలా సందర్భాల్లో చెప్పాడు.     

లేటెస్ట్ గా ఓ చాట్ షోలో మరోసారి సోనాలి ప్రస్థావన తీసుకొచ్చాడు షోయబ్ అక్తర్. ఇంగ్లీష్ బాబు దేసీ మేమ్ అనే సినిమాలో సోనాలిని చూసి ఇష్టాన్ని పెంచుకున్నాడట షోయబ్. ఆమె మీద ఉన్న ఇష్టంతో ఆమె ఫోటోని తన జేబులో పెట్టుకున్నానని చెప్పాడు అక్తర్. ఆమె తన ప్రేమను ఒప్పుకోకపోతే సోనాలిని కిడ్నాప్ చేయాలనుకున్నానని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు అక్తర్. రావల్పిండి ఎక్స్ ప్రెస్ షోయబ్ అక్తర్ కు సోనాలి కూడా చాలా సార్లు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.          



Related Post

సినిమా స‌మీక్ష