రాజ్ తరుణ్ ఆరేళ్ల ప్రేమ

June 15, 2019


img

ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి కుమారి 21ఎఫ్ తో హిట్ కొట్టి హీరోగా స్థిరపడ్డ రాజ్ తరుణ్ ప్రస్తుతం కెరియర్ లో వెనుకపడి ఉన్నా హిట్ ట్రాక్ ఎక్కేందుకు కొత్త ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరి లోకం ఒకటే సినిమా చేస్తున్న రాజ్ తరుణ్ తన పెళ్లి గురించి రీసెంట్ గా ఎనౌన్స్ మెంట్ చేసిన విషయం తెలిసిందే. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటున్న విషయం వెళ్లడించిన రాజ్ తరుణ్ తన ప్రియురాలి ఎవరన్నది బయట పెట్టలేదు.

అయితే లేటెస్ట్ గా మరోసారి తన ప్రేమ పెళ్లి విషయం గురించి ప్రస్థావించిన రాజ్ తరుణ్ తాను పెళ్లి చేసుకునే అమ్మాయి విజయవాడ అని.. తానో బిజినెస్ ఉమెన్ అని చెప్పాడు. అంతేకాదు ఆరేళ్లుగా తమ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తుందని చెప్పుకొచ్చాడు. తను చేసే సినిమాల హీరోయిన్స్ తో ఎఫైర్ పెట్టుకుంటున్నాడంటూ రాజ్ తరుణ్ పై ఇదవరకు వార్తలు వచ్చాయి. వాటన్నిటిని పటాపంచలు చేస్తూ రాజ్ తన ఆరేళ్ల ప్రేమ వ్యవహారం గురించి బయట పెట్టాడు. ఇన్ని చెప్పిన రాజ్ ఆమె పేరు మాత్రం రివీల్ చేయలేదు. డైరెక్ట్ గా ఎంగేజ్ మెంట్ తోనే ఆమె పేరు.. ఆమెని అందరికి చూపిస్తాడేమో అంటున్నారు.     



Related Post

సినిమా స‌మీక్ష