బిగ్ బాస్ నిర్వాహకులకు సునీల్ షాక్..!

June 15, 2019


img

కమెడియన్ కమ్ హీరో సునీల్ కెరియర్ మళ్లీ కమెడియన్ గా ట్రాక్ లో పడినట్టే అనిపిస్తుంది. చిత్రలహరి తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సునీల్ మళ్లీ తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధమయ్యాడు. ఇక లేటెస్ట్ గా సునీల్ కు బిగ్ బాస్ కంటెస్టంట్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. జూలైలో మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 3కి హోస్ట్ గా కింగ్ నాగార్జున వ్యవహరించనున్నాడని తెలుస్తుంది.

హోస్ట్ గా ఈసారి టాప్ సెలబ్రిటీస్ ను తీసుకునే క్రమంలో సునీల్ ను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు అడిగారట. కాని సునీల్ వారికి రోజుకి 25 లక్షలు ఇస్తే హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తానని చెప్పాడట. బిగ్ బాస్ హౌజ్ కంటెస్టంట్స్ ఆ సెలబ్రిటీస్ యొక్క క్రేజ్ ను బట్టి వారానికి ఓ ప్యాకేజ్ మాట్లాడుతారు. అయితే సునీల్ చెప్పిన రెమ్యునరేషన్ కు బిగ్ బాస్ నిర్వాహకులు షాక్ అయ్యి అంత ఇవ్వడం కష్టమని చెప్పారట. మరి మధ్యలో బేరం కుదుర్చుకున్నారో లేక డ్రాప్ అయ్యారో తెలియాల్సి ఉంది.     



Related Post

సినిమా స‌మీక్ష