నితిన్ 'భీష్మ' మొదలుపెట్టారు

June 12, 2019


img

ఛలో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ వెంకీ కుడుముల తన సెకండ్ ప్రాజెక్ట్ భీష్మను ఈరోజు సెట్స్ మీదకు తీసుకెళ్లారు. యువ హీరో నితిన్ లీడ్ రోల్ గా నటిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా మళ్లీ రష్మిక మందన్నను సెలెక్ట్ చేసుకున్నాడు వెంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. శ్రీనివాస కళ్యాణం ఫ్లాప్ తో వెనుకపడ్డ నితిన్ భీష్మతో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక నటించడంతో సినిమాకు స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. ఓ పక్క యువ హీరోతో నటిస్తూనే మరో పక్క స్టార్ హీరోలతో ఛాన్స్ పట్టేస్తుంది రష్మిక. సూపర్ స్టార్ మహేష్ 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అనీల్ రావిపుడి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు.    

 


Related Post

సినిమా స‌మీక్ష