కర్ణుడిగా నాని..!

May 25, 2019


img

నాచురల్ స్టార్ నాని జెర్సీ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు. ఇలాంటి పాత్రలు చేయడం తన తర్వాతే ఎవరైనా అనేలా నాని తన సత్తా చాటాడు. ఓ పక్క విక్రం కుమార్ డైరక్షన్ లో గ్యాంగ్ లీడర్ సినిమా చేస్తున్న నాని మరో పక్క ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో 'వి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. వి సినిమాలో నాని పాత్ర మహాభారతంలో కర్ణుడిని పోలి ఉంటుందట.  

స్నేహ ధర్మం కోసం అధర్మం అని తెలిసినా దుర్యోధనుడి పక్షం నిలిచిన కర్ణుడి పాత్రని పోలి నాని పాత్ర ఉంటుందట. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా కనిపిస్తారట. మరి హీరో నాని విలన్ గా చేస్తున్న ఈ 'వి' విక్టరీ కొడుతుందో లేదో చూడాలి. అష్టా చమ్మ, జెంటిల్మన్ తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ, నాని కాంబినేషన్ లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. Related Post

సినిమా స‌మీక్ష