శర్వానంద్ 'రణరంగం' టీజర్.. పక్కా మాస్..!

May 25, 2019


img

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో వస్తున్న మూవీకి క్రేజీ టైటిల్ ఫిక్స్ చేశారు. రణరంగం టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ టీజర్ లో షాడోలో శర్వానంద్ మరో ఇద్దరితో నడుచుకుంటూ రావడమే చూపించారు.

వాళ్ల వెనుక ఊరు జనం వస్తున్నారు.. సినిమా కథ ఏంటో రివీల్ చేయలేదు కాని టైటిల్ చూస్తే ఇది పక్కా కమర్షియల్ మాస్ సినిమాగా వస్తుందని చెప్పొచ్చు. రణరంగం టైటిల్ మంచి పవర్ ఫుల్ గా ఉంది. సినిమాలో శర్వానంద్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. టీజర్ తో పాటుగా సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. ఆగష్టు 2న రణరంగం రిలీజ్ ఫిక్స్ చేశారు. పడి పడి లేచే మనసు సినిమాతో నిరాశపరచిన శర్వానంద్ ఈ సినిమతో అయినా ఆశించిన ఫలితాన్ని అందుకుంటాడేమో చూడాలి.   

Related Post

సినిమా స‌మీక్ష