సైలెంట్ గా మొదలుపెట్టిన అఖిల్..!

May 24, 2019


img

అక్కినేని వారసుడు అఖిల్ 4వ సినిమా సైలెంట్ గా మొదలు పెట్టారు. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. బన్ని వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాలో హీరోయిన్ ఇతర విషయాల గురించి తెలియాల్సి ఉంది. బొమ్మరిల్లు సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న భాస్కర్ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

అఖిల్ నుండి మిస్టర్ మజ్ను వరకు సినిమాలైతే చేస్తున్నాడు కాని సరైన హిట్ దక్కించుకోలేని అఖిల్ ఈసారి పక్కా హిట్ ఫార్ములా కథతో వస్తున్నాడట. భాస్కర్ కూడా గ్యాప్ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ కథ సిద్ధం చేసుకున్నాడని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా అంటే సినిమా పక్కా హిట్ అన్నట్టే మరి ఈ సినిమా అయినా అఖిల్ కు కమర్షియల్ సక్సెస్ అందిస్తుందో లేదో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష