రాం చరణ్ 'ఆటోజానీ'

May 21, 2019


img

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆటో జానీ సినిమా చేయాల్సింది.. చిరు రీ ఎంట్రీ టైంలో పూరి చిరంజీవి కోసం ఈ కథ వినిపించారు. అంతా ఓకే అనుకున్న టైంలో సెకండ్ హాఫ్ దగ్గర స్టోరీ ఆపాల్సి వచ్చింది. అయితే చిరు కాదన్నా చరణ్ మాత్రం ఆ కథ మీద గురి పెట్టాడట. ఈమధ్య పూరిని కలిసి మాటల సందర్భంలో ఆటో జానీ ప్రస్థావన తెచ్చాడట. 

డాడీ చేయడం కుదరకపోతే ఆ కథతో తానే సినిమా చేస్తానని చెప్పాడట. రాం చరణ్ ను చిరుత సినిమాతో ఇంట్రడ్యూస్ చేసింది పూరినే. అందుకే పూరి మీద చరణ్ కు నమ్మకం ఉంది. మరి ఆటో జానీ చిరు కాకుంటే చరణ్ ఇది ఫిక్స్ అవ్వొచ్చు. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం పవర్ స్టార్ తో హిట్లు కొట్టిన పూరి ఒక్కసారి చిరంజీవిని కూడా డైరెక్ట్ చేయాలని కోరుతున్నారు. అది ఆటో జానీనే అయితే ఇంకా సూపర్ అంటున్నారు. మరి ఆటోజానీ ఇద్దరిలో ఎవరు చేస్తారో చూడాలి. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా షూటింగ్ లో బిజీగా ఉండగా రాం చరణ్ ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు.  



Related Post

సినిమా స‌మీక్ష