సాహో లుక్ అదిరిందిగా..!

May 21, 2019


img

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సుజిత్ డైరక్షన్ లో చేస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ వారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఓ క్రేజీ పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు. భారీ యాక్షన్ ఘట్టాలతో వస్తున్న ఈ సినిమా మరోసారి ఇండియన్ ప్రేక్షకులను అబ్బురపరచడం ఖాయమని అంటున్నారు. ఇక సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఈ పోస్టర్ ద్వారా ఎనౌన్స్ చేశారు. వార్తల్లో చెబుతున్నట్టుగానే ఆగష్టు 15న సాహో రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఇక రిలీజైన పోస్టర్ చూస్తే ప్రభాస్ ఓ కళ్లజోడుతో కనిపించాడు. యెల్లో కలర్ ఫిల్మ్ తో ఉన్న ఆ గ్లాస్ వెనుక ప్రభాస్ కళ్లల్లో ఇంటెన్స్ బాగుంది. సినిమాలో ప్రభాస్ దొంగని కొందరు.. కాదు పోలీస్ అని మరికొందరు అంటున్నారు. అయితే అసలు కథ ఏంటన్నది లీక్ అవకుండా జాగ్రత్తపడుతున్నారు చిత్రయూనిట్. రిలీజైన పోస్టర్ మాత్రం అదిరిపోయింది. బాహుబలి తర్వాత ప్రభాస్ మళ్లీ మరో సంచలనానికి సిద్ధమయ్యాడని మాత్రం చెప్పొచ్చు.  



Related Post

సినిమా స‌మీక్ష