చరణ్.. బన్ని.. అసలేంటి గొడవ..!

May 20, 2019


img

మెగా పవర్ స్టార్ రాం చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ఈమధ్య ఒకరంటే ఒకరికి పడట్లేదని.. అందుకే ఒకరి సినిమా సక్సెస్ అయినా మరొకరు ప్రస్థావన తీసుకురావట్లేదు అన్నది ఫిల్మ్ నగర్ టాక్. ఒకవేళ చరణ్ పేరు బన్ని, బన్ని పేరు చరణ్ ప్రస్థావించినా అది మొక్కుబడిగానే అన్నట్టు కొడుతుందని వార్తలు వచ్చాయి. అయితే వీటిపై వారు స్పందించలేదు కాని అల్లు అర్జున్ బ్రదర్ అల్లు శిరీష్ మాత్రం రెస్పాండ్ అయ్యాడు.

ఈమధ్యనే ఏబిసిడి అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు శిరీష్ ఆ సినిమా ప్రమోషన్స్ లో చరణ్, బన్నిల గొడవ గురించి నోరు విప్పాడు. అసలు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని.. చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వారు ఎందుకు గొడవ పడతారని అంటున్నాడు అల్లు శిరీష్. యూట్యూబ్ ఛానెల్స్ వ్యూస్ కోసం రాసే వార్తలు అవని.. వాటికి అసలు రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం వారికి లేదని అన్నాడు శిరీష్. 

 


Related Post

సినిమా స‌మీక్ష