రెమ్యునరేషన్ పెంచేసిన వరుణ్ తేజ్..!

May 14, 2019


img

మెగా హీరో వరుణ్ తేజ్ తన రెమ్యునరేషన్ పెంచినట్టు తెలుస్తుంది. ఎఫ్-2 సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న వరుణ్ తేజ్ పస్తుతం వాల్మీకి సినిమా చేస్తున్నాడు. హరీష్ శంకర్ డైరక్ష లో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నాడని తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాలో తమిళ హీరో అధర్వ కూడా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కిరణ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు వరుణ్ తేజ్.

బాక్సింగ్ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాకు గాను వరుణ్ తేజ్ 6.5 కోట్ల రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నాడట. ఎఫ్-2తో సూపర్ సక్సెస్ అందుకున్న వరుణ్ తేజ్ హరీష్ శంకర్ ముందు కమిట్మెంట్ కాబట్టి అంతకుముందు తీసుకున్న 4.5 కోట్లకే ఆ సినిమా చేస్తున్నాడట. కాని కొత్త దర్శకుడు సినిమా మాత్రం ఆరున్నర కోట్లు ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడట. ఫిదా ముందు వరకు కోటిన్నర 2 కోట్ల మధ్య ఉన్న వరుణ్ తేజ్ ఆ తర్వాత 4 కోట్ల హీరో అయ్యాడు. మొత్తానికి మెగా బ్రదర్ తనయుడిగా వరుణ్ తేజ్ మెగా హీరోల్లో తన స్టామినా చూపిస్తున్నాడు. 

రొటీన్ గా కాకుండా సినిమా సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో వరుణ్ తేజ్ సినిమాలు వస్తున్నాయి. అందుకే అతని సినిమాల మీద సగటు సిని ప్రేక్షకుడు ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతాడు. మరి వాల్మీకి వరుణ్ తేజ్ ఎలాంటి సందడి చేస్తాడో చూడాలి.  Related Post

సినిమా స‌మీక్ష