మహర్షిలో మరికొన్ని సీన్స్ యాడ్..!

May 14, 2019


img

సూపర్ స్టార్ మహేష్ నటించిన 25వ సినిమా మహర్షి సెన్సేషనల్ హిట్ అయ్యింది. 5 రోజుల్లో ఈ సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో 51.67 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో కూడా 1 మిలియన్ క్రాస్ చేసింది. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహేష్ 3 వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటించగా అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ చేశాడు.

సినిమా ఇప్పటికే రన్ టైం ఎక్కువైందన్న టాక్ ఉంది. కథకు కనెక్ట్ అయ్యారు కాబట్టి రన్ టైం పెద్దగా పట్టించుకోవట్లేదు. అయితే సినిమాకు వచ్చిన హిట్ టాక్ తో ఆడియెన్స్ ను రిపీట్ చేయడం కోసం మరో రెండు సీన్స్ యాడ్ చేస్తున్నారట. అందులో ఒకటి పూజా హెగ్దె ఇంట్లో మహేష్ పెళ్లిచూపులు సీన్ ఇంకాస్త పొడిగిస్తారట. అంతేకాదు అల్లరి నరేష్ తో రైతుల గురించి మాట్లాడే సీన్ ఉంటుందట. ఈ రెండు సీన్స్ కూడా మహర్షిలో యాడ్ చేస్తారని తెలుతుంది. మరి నిజంగానే యాడ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.     Related Post

సినిమా స‌మీక్ష