మహేష్ కాలర్ ఎగరేశాడంటే..!

May 13, 2019


img

సూపర్ స్టార్ మహేష్ 25వ సినిమా వచ్చిన మహర్షి సూపర్ హిట్ అయ్యింది. తన ల్యాండ్ మార్క్ మూవీ ఇంతటి ఘనవిజయం అందించిన ప్రేక్షకులకు మహేష్ థ్యాంక్స్ చెప్పాడు. ఇక ఆదివారం జరిగిన సక్సెస్ మీట్ లో మహేష్ చాలా ఎక్సైట్ మెంట్ తో మాట్లాడాడు. సినిమాకు పనిచేసిన టీం అందరిని విష్ చేసిన మహేష్ తన అమ్మ కాఫీ తనకు ప్రసాదంతో సమానమని అన్నారు. అమ్మ తనకు దేవుడని.. అందుకే మహర్షి సక్సెస్ అమ్మలందరికి అంకితం చేస్తున్నా అన్నారు.

ఇక దేవి మ్యూజిక్ లేకుండా ఈ సినిమా లేదని.. సినిమాకు దేవి శ్రీ చాలా మంచి సంగీతం ఇచ్చారని.. పదరా పదరా.. ఇదే కదా ఇదే కదా సాంగ్స్ ఎప్పుడు విన్నా గూస్ బమ్స్ వస్తాయని అన్నారు. ఇక డైరక్టర్ వంశీ పైడిపల్లి గురించి మాట్లాడుతూ వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పినట్టుగా అభిమానులు కాలర్ ఎగురవేసే సినిమా అవుతుందని అన్నాడు.. వాళ్లే కాదు తాను కూడా కాలర్ ఎగురవేస్తున్నా అంటూ సర్ ప్రైజ్ గా కాలర్ ఎగురవేసి చూపించాడు మహేష్.

మహేష్ తన 25 సినిమాల జర్నీలో సూపర్ హిట్లు చూశాడు కాని ఎందుకో మహర్షి సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపించింది. సినిమా ఆడియెన్స్ అందరికి రీచ్ అవడంతో ఊహించిన విజయం అందుకుంది. మొత్తానికి మహర్షి మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ నిలుస్తున్న మాట నిజం కాబోతుంది.Related Post

సినిమా స‌మీక్ష