నిర్మాతగా కాజల్..!

May 11, 2019


img

దశాబ్ధ కాలం పైగా హీరోయిన్ గా టాప్ లో ఉంటూ వచ్చిన కాజల్ అగర్వాల్ మధ్యలో కొన్నాళ్లు కెరియర్ లో వెనుకపడినట్టు అనిపించినా మళ్లీ ఇప్పుడు ఫుల్ ఫాంలోకి వచ్చింది. ఎప్పుడూ చేతినిండా సినిమాలతో ఉంటున్న కాజల్ కొత్తగా నిర్మాణ రంగంలోకి వచ్చేందుకు సిద్ధమైంది. కాజల్ నిర్మాతనా ఏంటి నిజమేనా అంటే అవును నిజమే కాని ఫుల్ టైం నిర్మాత కాదు పార్ట్ టైం నిర్మాత. 

పెళ్లిచూపులు నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాణంలో తన తనయుడు హీరోగా వస్తున్న సినిమాకు కాజల్ సమర్పకురాలిగా ఉంటుందట. రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్ హిరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు మనుచరిత్ర అని టైటిల్ డిసైడ్ చేశారు. కథ నచ్చి కాజల్ ఈ స్టెప్ తీసుకుందని తెలుస్తుంది. హింది క్వీన్ సినిమా రీమేక్ గా తమిళంలో ఓ సినిమా చేసిన కాజల్ తెలుగులో ప్రస్తుతం బెల్లంకొండ బాబు సరసన సీత సినిమాలో నటించింది. తేజ డైరక్షన్ లో వస్తున్న ఆ సినిమా కాజల్ కు మంచి పేరు తెచ్చిపెడుతుందని చెప్పుకుంటున్నారు.    
Related Post

సినిమా స‌మీక్ష