మజిలీ డీలీటెడ్ సీన్.. ఒక్క హగ్ తో విలన్ ను మార్చేసిన చైతు..!

April 18, 2019


img

అక్కినేని నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వచ్చిన సినిమా మజిలీ. చైతు సరసన సమంత, దివ్యాన్ష కౌశిక్ నటించిన ఈ సినిమా నాగ చైతన్య కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఏప్రిల్ 5న రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల మనసులు గెలిచింది. ఇక నిడివి ఎక్కువవడం వల్ల సినిమా నుండి కొన్ని సీన్స్ కట్ చేయడం మాములే. అయితే సినిమా హిట్టైతే ఆ సీన్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారు.

లేటెస్ట్ గా మజిలీ నుండి ఓ డిలీటెడ్ సీన్ రిలీజ్ చేశారు. మజిలీలో విలన్ గా నటించిన సుబ్బరాజు కూడా మెప్పించాడు. అయితే ఓ సీన్ లో అతన్ని కూడా మార్చేలా పూర్ణ ప్రవర్తన ఉంటుంది. పూర్ణ దగ్గరకు వచ్చి సుబ్బరాజుని హగ్ చేసుకుంటాడు. అలా అతని మీద ఉన్న కోపాన్ని మర్చిపోయానంటాడు. అతను కూడా చైతు దగ్గరకు వస్తుంటే కత్తి తీసుకుంటాడు కాని చైతు మాటలు విని సైలెంట్ అయిపోతడు. ఈ సీన్ నిజంగా సినిమాలో ఉంటే బాగుండేది అన్న భావన కలుగుతుంది. మజిలీ ఓ ఎమోషనల్ జర్నీగా తెరకెక్కించిన శివ నిర్వాణ ఈ సీన్ సినిమాలో ఉంచితే బాగుండేదని డిలీటెడ్ సీన్ చూసిన వారు అంటున్నారు. 

Related Post

సినిమా స‌మీక్ష