బాహుబలి వచ్చేశాడహో..!

April 18, 2019


img

అదేంటి బాహుబలి ఇప్పుడు రావడమేంటి అది వచ్చి రెండేళ్లు పైనే అయ్యింది కదా అనుకోవచ్చు. అయితే బాహుబలి సినిమా కాదు బాహుబలి ప్రభాస్ ఇన్ స్టాగ్రాం లోకి వచ్చాడు. స్టార్ హీరోస్ సోషల్ మీడియా ఇంటరాక్షన్ ఇప్పుడు బాగా ఎక్కువైంది. తమకు సంబందించిన ప్రతి అంశాన్ని అందులో పొందుపరుస్తున్నారు. అంతేకాదు తమ ఫ్యాన్స్ కు ఎలాంటి మెసేజ్ ఇవ్వాలన్న ఫేస్ బుక్, ట్విట్టర్ లను వాడుతున్నారు. ఇక తమ స్పెషల్ పిక్స్ కోసం ఇన్ స్టాగ్రాం యూజ్ చేస్తున్నారు.

తెలుగు స్టార్ అంతా ఇప్పటికే ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాంలలో ఉండగా కొత్తగా ఇన్ స్టా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. యాక్టర్ ప్రభాస్ అనే ఇన్ స్టా ఎకౌంట్ ఓపెన్ చేసిన ప్రభాస్ బాహుబలి పిక్ ఒకటి షేర్ చేశాడు. ఒక్క ఫోటోతోనే ఇన్ స్టాలో 7 మిలియన్ ఫాలోవర్స్ ఏర్పరచుకున్నాడు ప్రభాస్. ఇది ప్రభాస్ క్రేజ్ కు నిదర్శనమని చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.  Related Post

సినిమా స‌మీక్ష