జబర్దస్త్ కు రోజా గుడ్ బై..!

April 17, 2019


img

బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని వారు ఉండరనుకోవచ్చు. ఐదేళ్లుగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో కమెడియన్స్ మారుతున్నా సరే జడ్జులుగా నాగబాబు, రోజాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నారు. ఆ షో ద్వారా మళ్లీ వారు కూడా మంచి ఫాంలోకి వచ్చారని చెప్పొచ్చు. ఈసారి ఏపి ఎలక్షన్స్ లో రోజా నగరి ఎమ్మెల్యేగా.. నాగబాబు నరసాపురం ఎంపి స్థానాలకు పోటీ చేశారు.        

మెగా బ్రదర్ నాగబాబు మాత్రం తాను ఎంపిగా గెలిచినా ఓడినా జబర్దస్త్ మాత్రం వీడే ప్రసక్తే లేదని అన్నారు. కాని రోజా పరిస్థితి వేరేలా ఉంది. ఎన్నికల ప్రచారంలో నాగబాబు, రోజా ఇద్దరు జబర్దస్త్ కు దూరమయ్యారు. వారి స్థానంలో మీనా, శేఖర్ మాస్టర్ జడ్జులుగా ఉన్నారు. అయితే నాగబాబు మళ్లీ జబర్దస్త్ కు వస్తాడేమో కాని రోజా మాత్రం ఇక రావడం కష్టమని అంటున్నారు. ఈసారి ఎలక్షన్స్ లో తాను గెలిస్తే జబర్దస్త్ వదిలేస్తా అని చెబుతున్న రోజా ఏపిలో వైసిపి ప్రభుత్వం ఏర్పడితే ఆమెకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అందుకే ఇక జబర్దస్త్ కు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందట. Related Post

సినిమా స‌మీక్ష