ధరం తీస్తే హిట్టు దక్కిందే...!

April 15, 2019


img

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇప్పుడు సాయి తేజ్ గా మారాడు. వరుసగా ఆరు ఫ్లాపులు అందుకున్న సాయి ధరం తేజ్ ఫైనల్ గా కిశోర్ తిరుమల డైరక్షన్ లో చిత్రలహరి సినిమా చేశాడు. ఆ సినిమా ఏప్రిల్ 12న రిలీజై మిక్సెడ్ టాక్ తో మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ సినిమాతో సాయి ధరం తేజ్ కాస్త సాయి తేజ్ గా పేరు మార్చుకున్నాడు.

పేరులో ధరం తీసేయగా హిట్టు కొట్టాడు ఈ హీరో. మరి పేరు మార్పిడి ఎవరి సలహానో తెలియదు కాని మొత్తానికి సాయి తేజ్ ఖాతాలో ఓ సూపర్ హిట్ పడ్డది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా మూడు రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 7.75 కోట్లు రాబట్టింది. వరుస ఫ్లాపులతో డీలా పడ్డ సాయి తేజ్ ఈ హిట్ తో కెరియర్ లో నూతన ఉత్సాహం తెచ్చుకున్నాడని చెప్పొచ్చు. ఇక మీదట అయినా కథల విషయంలో కాస్త జాగ్రత్త పడితే మంచిది లేదంటే మళ్లీ రిస్క్ లో పడే అవకాశం ఉంటుంది.  Related Post

సినిమా స‌మీక్ష